Posts

Showing posts from March, 2026

**గణిత రూపం - ఉగాది కావ్యం**

**గణిత రూపం - ఉగాది కావ్యం**   పరాభవ నామ ఉషస్సు మన జీవితంలో ఒక కొత్త రేఖలా ప్రారంభమవుతుంది గతాన్ని ఒక చిన్న బిందువుగా వెనక్కి వదిలేస్తుంది. భవిష్యత్తు వైపు సూటిగా సాగిపోవాలని మనసు పరితపిస్తుంది, మన ఆశలు ఒక అర్ధరేఖలా అనంతంగా విస్తరిస్తాయి. ఒకే దిశలో పయనించే మన సంకల్పాలు దిక్సూచిలా దారి చూపుతాయి, కాల చక్రం భ్రమిస్తూ కోణాల్లా మార్పులను తెస్తుంది. కొన్ని కోణాలు లఘువుగా (చిన్నవిగా), మరికొన్ని విశాలంగా మారుతాయి, కానీ ప్రతి కోణం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. మన కుటుంబం ఒక వృత్తంలా ప్రేమతో మనల్ని చుట్టుకుంటుంది, ఆ వృత్తానికి ఆది అంతం లేని ఒక అనంత అనుబంధం ఉంటుంది. మన స్నేహాలు సమాంతర రేఖల్లా ఎప్పటికీ కలవకపోయినా.. తోడుగా నడుస్తాయి, కొన్ని సంబంధాలు ఛేదరేఖల్లా ఒక బిందువు వద్ద కలిసి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మన భావాలు వక్రరేఖల్లా మలుపులు తిరుగుతుంటాయి, సంకల్పాలు బహుభుజాల్లా అనేక వైపులా విస్తరిస్తాయి. అయినా వాటన్నిటి గమ్యం ఒకే లక్ష్య బిందువు వైపు సాగుతుంది, మన ప్రయత్నం త్రిభుజంలా మూడు మూలలపై స్థిరంగా నిలబడుతుంది. ఆశ, శ్రమ, విశ్వాసం.. ఈ మూడు సమతుల్యంగా ఉంటేనే విజయం సిద్ధస్తుంది, జీవితం ...